Krunal Pandya stopped by DRI at the Mumbai Airport: ముంబై: దుబాయ్ ఐపీఎల్ (IPL 2020) 13వ సీజన్ తాజాగా ముగిసిన సంగతి తెలిసిందే. క్రికెటర్లందరూ దుబాయ్ నుంచి తమ తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్‌ (Mumbai Indians) ఆల్‌రౌండర్‌, హార్దిక్‌ పాండ్య సోదరుడు కృనాల్‌ పాండ్య (Krunal Pandya) చిక్కుల్లో పడ్డాడు. ముంబై వచ్చిన ఈ ఆల్‌రౌండర్ కృనాల్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ (DRI) అధికారులు అదుపులోకి తీసుకోని ఆపేశారు. అతని దగ్గర ఉన్న బంగారం, ఇతర విలువైన వస్తువులకు అనుమతులు లేవనే ఆరోపణలతో డీఆర్‌ఐ అధికారులు కృనాల్‌ను ఎయిర్‌పోర్టులోనే నిలిపివేశారు. ఈ మేరకు బంగారం, ఇతర విలువైన వస్తువులపై కృనాల్‌ను ప్రశ్నించినట్లు డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. Also read: Rohit Sharma: ఆ ప్లేయర్స్‌కు సైతం ధన్యవాదాలు తెలిపిన రోహిత్ శర్మ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే.. నిర్దేశించిన పరిమాణం కంటే ఎక్కువ బంగారం, ఇతర విలువైన వస్తువులు తనదగ్గర ఉన్నాయని కృనాల్‌ ఒప్పుకున్నాడని పేర్కొంటున్నారు. అయితే నిబంధనల గురించి తనకు తెలియదని కృనాల్‌ అధికారులకు తెలియజేశాడు. దీనికి క్షమాపణలు చెప్పి, జరిమానా కూడా చెల్లించినట్లు తెలిసింది. ఐపీఎల్‌ ఫైనల్లో ముంబై జట్లు ఢిల్లీ క్యాపిటల్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొంది.. ఐపీఎల్ చరిత్రలో ఐదోసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. అయితే విన్నింగ్ టీమ్‌లో పాండ్య సోదరులు ఇద్దరూ ఉన్నారు.